![]() |
.webp)
సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షణ్ముఖ్.. తాజాగా తన స్నేహితురాలు వైష్ణవి చోడిశెట్టిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని షణ్ముఖ్ ప్రకటించాడు. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొద్ది రోజుల క్రితం వైష్ణవితో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి . ఇక ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అసలు విషయం అభిమానులకు తెలిసింది . పెళ్లి మండపంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన నూతన వధూవరుల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విశాఖపట్నానికి చెందిన షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వైవా షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి యూట్యూబ్ సిరీస్‌లు అతడికి బాగా ప్రజాదరణ వచ్చింది . కొన్ని తెలుగు మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు షన్ను. అతడి కెరీర్ ని మలుపు తిప్పింది బిగ్‌బాస్ రియాలిటీ షో. ఈ షోలో పాల్గొన్న షణ్ముఖ్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని రన్నరప్‌గా నిలిచాడు. షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించినప్పటికీ, పర్సనల్ లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి సునైనాతో బ్రేకప్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇది కూడా బాగా వైరల్ అయ్యింది. కొంతకాలానికి వైష్ణవి చోడిశెట్టితో షణ్ముఖ్ ప్రేమలో పడ్డాడు. దాంతో నిశ్చితార్థం పెళ్లితో ఒకింటివాడయ్యాడు.
https://www.instagram.com/p/DZ46vClk_b3/
![]() |